: చర్చలు సఫలం.. ఏపీలో లారీ యజమానుల సమ్మె విరమణ
కొన్ని రోజులుగా లారీ యజమానులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ రోజు వారితో సమావేశమైన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యలపై ఓ కమిటీ ఏర్పాటు చేశామని, 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించామని అచ్చెన్నాయుడు తెలిపారు. లారీ యజమానుల సంఘం తమకు ఆరు అంశాలతో కూడిన ఓ వినతిపత్రం ఇచ్చిందని చెప్పారు. వాటిల్లో రాష్ట్ర పరిధిలోని అంశాలను పరిశీలించేందుకు కమిటీ వేశామని, రెండు అంశాలు మాత్రం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని అన్నారు. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని లారీ ఓనర్స్ అసోసియేషన్ పేర్కొంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని సమ్మె విరమిస్తున్నామని తెలిపారు.