: శివసేన ఎంపీల ప్రవర్తనను ఖండిస్తూ నారా లోకేష్ ట్వీట్
పార్లమెంటులో శివసేన ఎంపీలు వ్యవహరించిన తీరు పట్ల ఏపీ మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. వారి దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పట్ల పలువురు ఎంపీలు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని... వారి తీరును ఖండిస్తున్నానని అన్నారు.
ఎయిరిండియా సిబ్బందిని తాను కొట్టిన అంశంపై శివసేన ఎంపీ గైక్వాడ్ ఈ రోజు లోక్సభలో వివరణ ఇచ్చారు. మరోవైపు, ఇదే అంశంపై అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ, ప్రయాణికుల భద్రత అంశంలో రాజీ పడే ప్రసక్తేలేదని అన్నారు. గైక్వాడ్- ఎయిర్ ఇండియా వివాదంలో విచారణ కొనసాగుతోందని అన్నారు.
ఆ వెంటనే లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అశోక్ గజపతిరాజుపై శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించారు. ఆయనను చుట్టుముట్టి పలు వాదనలు వినిపించారు.