: హైదరాబాద్ నాకు ఎప్పుడూ లక్కీ ప్లేసే: యువరాజ్ సింగ్


ఐపీఎల్-2017 సీజన్ ను టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఘనంగా ఆరంభించాడు. హైదరాబాదులో ఆర్సీబీ జట్టుపై నిన్న జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు విజయం సాధించింది. 27 బంతుల్లో 62 పరుగులు చేసి, జట్టు విజయంలో యువీ కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ, హైదరాబాద్ తనకు ఎప్పుడూ లక్కీ ప్లేసేనని చెప్పాడు. ఇక్కడ అనేక పరుగులు సాధించానని చెప్పాడు. తమ జట్టులో బ్యాట్స్ మెన్, బౌలర్లు ఇద్దరూ బాగా రాణించారని తెలిపాడు. టీమిండియాలో తిరిగి చోటు సంపాదించడం తన ఆట తీరుపై మంచి ప్రభావం చూపిందని చెప్పాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడానని అన్నాడు. 

  • Loading...

More Telugu News