: గైక్వాడ్ దాడి చేశారని ఎవరు చెప్పారు?: మీడియాను ఎదురు ప్రశ్నించిన శివసేన ఎంపీలు
ఎయిరిండియా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి, చేయిచేసుకున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఆ తరువాత తాను వారిని చెప్పుతో కొట్టానని కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు లోక్‌సభ ప్రారంభం కాకముందు ఆ ప్రాంగణంలో శివసేన ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ఆయనను కాపాడే ప్రయత్నం చేశారు. అసలు గైక్వాడ్ దాడి చేశారని ఎవరు చెప్పారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. గైక్వాడ్ మీడియాతో ఎందుకు మాట్లాడట్లేదని ఓ విలేకరి అడగగా.. తమకు మీడియా నుంచి దూరంగా పారిపోయే అవసరం లేదని అన్నారు. గైక్వాడ్ పార్లమెంట్ సభ్యుడని, లోక్‌సభలో మాట్లాడతారని చెప్పారు.