: అడవుల్లో బాలికను సంవత్సరాల పాటు పెంచిన కోతులు... యూపీలో వెలుగుచూసిన ఆసక్తికర అంశం


ఆ బాలిక కోతి మూకకు ఏ వయసులో దొరికిందో, ఎక్కడ దొరికిందో తెలియదు. బాలికను ఎక్కడి నుంచి తీసుకు వెళ్లాయో, ఏమో కానీ ... ఆ కోతులు పాపను కంటికి రెప్పలా సాకాయి. ఇప్పుడా పాప నాగరిక సమాజంలో చిక్కుకుని, దిక్కుతోచని స్థితిలో ఉంది. నా అనుకున్న కోతులు పక్కన లేక, సాధారణ మానవుల అలవాట్లు అలవడక ఇబ్బందులు పడుతోంది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, బహరైచ్ సమీపంలోని మోతీపూర్ రేంజ్ లో ఉన్న కటార్నియాఘాట్ వైల్డ్ లైఫ్ సాంక్చరీలో పెట్రోలింగ్ కు వెళుతున్న ఓ పోలీసు బృందానికి కోతులతో పాటు ఉన్న ఎనిమిదేళ్ల బాలిక కనిపించింది. ఆ బాలిక కోతులతో కలసి ఆనందంగానే ఉన్నట్టు వారికి కనిపించింది. అతి కష్టం మీద వారు ఆ బాలికను రక్షించి, ఆసుపత్రిలో చేర్చారు. ఆ పాప మాట్లాడటం లేదు, ఎదుటివారు మాట్లాడే భాషను అర్థం చేసుకోవడం లేదు. మనుషులను చూసి భయపడిపోతోంది. రెండు కాళ్లతో పాటు చేతులనూ ఉపయోగించి నడుస్తోంది. చేతులతో తినకుండా, డైరెక్టుగా నోటితోనే ఆహారం తీసుకుంటోంది. ఆ పాపకు వైద్యులు చికిత్స ప్రారంభించారని, చాలా నిదానంగా రికవరీ వస్తోందని సమాచారం.

  • Loading...

More Telugu News