: ఢిల్లీ చేరుకున్న జగన్మోహన్ రెడ్డి.. కాసేపట్లో రాష్ట్రపతితో భేటీ
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో జగన్ భేటీ కానున్నారు. వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని వైసీపీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రణబ్ ముఖర్జీకి జగన్ ఓ వినతి పత్రాన్ని ఇవ్వనున్నారు. అంతేకాదు, రాజ్యాంగాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్న తీరును రాష్ట్రపతికి వివరించనున్నారు. జగన్ తో పాటు వైసీపీకి చెందిన ఎంపీల బృందం కూడా రాష్ట్రపతి భవన్ కు వెళుతోంది.