: విమాన సిబ్బందిని చెప్పుతో కొట్టిన ఎంపీ గైక్వాడ్ ఎట్టకేలకు విమానం ఎక్కారు!


ఎయిరిండియా సిబ్బందిపై దురుసుగా ప్ర‌వ‌ర్తించడమే కాకుండా, చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎట్టకేలకు విమానం ఎక్కారు. ఆ ఘటన తర్వాత ఆయ‌నపై పలు విమానయాన సంస్థ‌లు నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ రోజు ఓ ప్రైవేట్ విమానంలో ఆయ‌న పుణె నుంచి ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు గాను ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు శివసేన ఏర్పాట్లు చేయ‌డంతో ఆయ‌న ఎట్ట‌కేల‌కు చార్టర్డ్ విమానంలో కాలు పెట్టారు. తనపై విమానయాన సంస్థలు నిషేధం విధించిన విషయాన్ని గైక్వాడ్ ప్ర‌స్తుతం పార్లమెంట్‌లో వివ‌రిస్తున్నారు.

  • Loading...

More Telugu News