: కాల్వ శ్రీనివాసులుకు షాక్... కార్యక్రమానికి జిల్లా నేతలంతా దూరం!
ఏపీ సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహనిర్మాణ శాఖల మంత్రిగా అనంతపురం జిల్లా రాయదర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు నేడు బాధ్యతలు స్వీకరించారు. అయితే, సొంత జిల్లాకు చెందిన టీడీపీ నేతలంతా ఆయనకు షాక్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు మాత్రమే హాజరయ్యారు. ఇతర టీడీపీ నేతలంతా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి, బీకే పార్థసారథి, యామినీ బాల, వరదాపురం సూరిలు హాజరు కాలేదు. మంత్రి పదవి కోసం పయ్యావుల, పార్థసారథిలు చివరి నిమిషం వరకు ప్రయత్నించి, విఫలమైన సంగతి తెలిసిందే.