: కలకలం సృష్టించిన పురందేశ్వరి లేఖపై స్పందించిన బీజేపీ మంత్రి మాణిక్యాలరావు
వైకాపా నుంచి ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా మంత్రులుగా తీసుకోవడాన్ని తప్పుబడుతూ, బీజేపీ మహిళా నేత పురందేశ్వరి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖ రాయడంపై ఏపీ దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు స్పందించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, లేఖ ద్వారా పురందేశ్వరి తన అభిప్రాయాన్ని మాత్రమే తెలిపారని అన్నారు. అది ఆమె వ్యక్తిగతమని, ఈ అంశంపై తన అభిప్రాయాన్ని పార్టీ అంతర్గత వేదికపై చెబుతానని, బయట మాత్రం మాట్లాడబోనని స్పష్టం చేశారు. కొత్త మంత్రులను స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని తెలిపారు. వారితో కలసి పనిచేసేందుకు సిద్ధమని వెల్లడించారు. పార్టీలు మారడం అన్నది సర్వసాధారణమైపోయిందని చెప్పారు.