: కడప జిల్లాలో పట్టుచీరలు షాపింగ్ చేసిన రోజా!
నిన్న ఒంటిమిట్ట కోదండ రామాలయానికి వచ్చి బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యే రోజా, అక్కడికి దగ్గరలో ఉన్న మాధవరంలో పట్టు చీరలను షాపింగ్ చేశారు. ఇక్కడి చీరల గొప్పతనాన్ని స్థానిక కార్యకర్తల నుంచి తెలుసుకున్న ఆమె, స్వయంగా మాధవరం వెళ్లి చీరలు కొనుగోలు చేశారు. ఇక్కడి చీరలు చాలా బాగున్నాయని, తనకు నచ్చాయని ఈ సందర్భంగా రోజా వ్యాఖ్యానించారు. ఈ చీరలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆమె వెంట కడప జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథరెడ్డితో పాటు జడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.