: ప్రజలకు సేవ చేయకుండా.. రాష్ట్రమంతటా కబేళాలు కట్టించింది!: సమాజ్ వాదీ పార్టీపై యోగి ఫైర్


సమాజ్ వాదీ పార్టీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రులు కట్టించి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, రాష్ట్రమంతటా కబేళాలు కట్టించిందంటూ యోగి మండిపడ్డారు. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీలో ఆయన కొత్త వెంటిలేటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే ఆరు కొత్త ఎయిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

గత ప్రభుత్వం మంచి వైద్యులందరినీ కనౌజ్, సైఫైలకు తరలించిందని... గోరఖ్ పూర్ కు మాత్రం వైద్యులకు బదులు కబేళాలను ఇచ్చిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ కు కనీసం ఐదు లక్షల మంది వైద్యులు అవసరమని చెప్పారు. పల్లెలకు వెళ్లి ప్రజలకు సేవ చేయాల్సిన వైద్యులు నగరాలు, పట్టణాల్లో ఉంటూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారని విమర్శించారు. గోరఖ్ పూర్ లో తాను కూడా ఒక చిన్న క్లినిక్ తెరిచానని... ఇతర ఆసుపత్రుల్లో సీటీ స్కానింగ్ కు రూ. 1800 నుంచి 4000 వరకు తీసుకుంటుంటే... తాము మాత్రం రూ. 400 నుంచి 600 వరకే తీసుకుంటున్నామని తెలిపారు. 

  • Loading...

More Telugu News