: అప్పటి వరకు నేను ఐపీఎల్ ఆడే ప్రసక్తే లేదు: కోహ్లీ


ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడ్డ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... చివరి టెస్టుకు దూరమయ్యాడు. అయితే, ఐపీఎల్ లో విరాట్ ఆడతాడని, విరాట్ విశ్వరూపాన్ని చూడొచ్చని అందరూ భావించారు. కానీ, నిన్న సన్స్ రైజర్స్, ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ బరిలోకి దిగలేదు. ఈ సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ, తాను కచ్చితంగా 120 శాతం పిట్ గా ఉంటేనే బరిలోకి దిగుతానని... అంతవరకు ఆడే అవకాశమే లేదని స్పష్టం చేశాడు. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి తాను సన్నద్ధం కావాలంటే, ఇప్పుడు ఎలాంటి రిస్కూ తీసుకోకూడదని చెప్పాడు. మరోవైపు ఆర్సీబీపై సన్ రైజర్స్ హైదరాబాద్ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. 

  • Loading...

More Telugu News