: నటి రంభతో కాపురానికి ఓకే చెప్పిన భర్త


ప్రముఖ సినీ నటి రంభ సమస్యకు శుభం కార్డు పడింది. 2010లో కెనడాకు చెందిన పద్మనాభన్ అనే పారిశ్రామికవేత్తను రంభ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడివిడిగా ఉంటున్నారు. రంభ కూడా కెనడా నుంచి ఇండియాకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో, తనతో కాపురం చేసేందుకు తన భర్తను ఆదేశించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో రంభ పిటిషన్ వేసింది. విచారణ సందర్భంగా రంభతో కాపురానికి పద్మనాభన్ సిద్ధంగా ఉన్నారంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో, రంభ వేసిన కేసును ముగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరూ కలసి సామరస్య కేంద్రంలో రాజీ కుదుర్చుకోవచ్చంటూ తెలిపింది. 

  • Loading...

More Telugu News