: ఎండల నుంచి ఉపశమనం... రెండు రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడటమే ఇందుకు కారణమని, ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఉపరితల ద్రోణి ప్రభావం తగ్గిన తరువాత, ఎండ వేడిమి మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.