: నా ప్రయత్నాలను అప్పట్లో వైసీపీ అడ్డుకుంది: లోకేష్


పని విషయంలో తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే తనకు పోటీ అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఐటీ పరిశ్రమతో తనకు ఉన్న పరిచయాలతో ఏపీకి పెట్టుబడులను తీసుకొస్తానని చెప్పారు. వాస్తవానికి మంత్రిని కాకముందు నుంచే పెట్టుబడుల కోసం తాను యత్నించానని తెలిపారు. ఇప్పుడు అధికారిక హోదాలో తన లక్ష్యాన్ని సాధిస్తానని చెప్పారు. పెట్టుబడులను తీసుకొచ్చేందుకు గతంలో తాను చేసిన ప్రయత్నాలను అప్పట్లో వైసీపీ అడ్డుకుందని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News