: గోవధ, ట్రిపుల్ తలాక్‌పై షియా పర్సనల్ లాబోర్డు సంచలన ఫత్వా!


గోవధ, గో మాంస విక్రయంపై ఆల్ ఇండియా షియా పర్సనల్ లాబోర్డు (ఏఐఎస్‌పీఎల్‌బీ) బుధవారం సంచలన ఫత్వా జారీ చేసింది. గోవును వధించడం కానీ, గో మాంసాన్ని విక్రయించడం కానీ చేయరాదంటూ ఫత్వాలో పేర్కొంది. బుధవారం లక్నోలో జరిగిన  ఏఐఎస్‌పీఎల్‌బీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు  మౌలానా యసూబ్‌ అబ్బాస్‌ తెలిపారు. ట్రిపుల్ తలాక్, రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై మాట్లాడుతూ వీటిని కోర్టు బయట పరిష్కరించుకునేందుకు సమ్మతంగా ఉన్నట్టు సమావేశంలో తీర్మానించినట్టు తెలిపారు. వాట్సాప్, ఫోన్ల ద్వారా మూడుసార్లు తలాక్ చెప్పే పద్ధతి ఆమోద యోగ్యం కాదన్నారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం మహిళలకు కూడా పురుషులతో సమానమైన హక్కులు ఉన్నాయన్నారు. ఇరాక్‌లోని షియా మతపెద్ద అయతోల్లాహ్‌ షేక్‌ బషీర్‌ నజఫీ ఆదేశాల మేరకే ఈ తీర్మానాలను ప్రవేశపెట్టినట్టు అబ్బాస్‌ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News