: నాకు ప్రజలే రక్షణ.. గన్‌మెన్లు అవసరం లేదు: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని


మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో అలకపాన్పు ఎక్కిన చింతమనేని తనకున్న నలుగురు గన్‌మెన్లలో ఇద్దర్ని వెనక్కి పంపారు. మంత్రి పదవి దక్కకపోవడంతో తొలుత పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన చింతమనేని తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖను పంపారు. అయితే సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత మెత్తబడ్డారు. సీఎంను కలిసి 24 గంటలు కూడా గడవకముందే ప్రభుత్వం తనకు కల్పించిన నలుగురు గన్‌మెన్లలో ఇద్దరిని వెనక్కి పంపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ప్రజలే రక్షణ అని, గన్‌మెన్లు అవసరం లేదని పేర్కొన్నారు.  తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేనందున వెనక్కి వచ్చిన ఇద్దరు గన్‌మెన్లను ఎస్పీ భాస్కర్ భూషణ్ తిరిగి చింతమనేని వద్దకు పంపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత అంతా సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో చింతమనేని వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్టు అయింది.

  • Loading...

More Telugu News