: ఫ్లైటెక్కుతున్నారా? ఆధార్ ఉందో.. లేదో చెక్ చేసుకోండి.. అది ఉంటేనే ఆకాశయానం: కొత్త నిబంధనకు కేంద్రం యోచన!
ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్న కేంద్రం ఇప్పుడు ఆకాశయానానికి కూడా ఆధార్‌ను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. అది ఉంటేనే విమానయానానికి అనుమతించాలని నిర్ణయించినట్టు సమాచారం. బుకింగ్ కౌంటర్‌లో ఆధార్ నంబరు సమర్పించిన తర్వాతే టికెట్ ఇవ్వనున్నారు. ప్రయాణికుల నుంచి వేలిముద్రలు తీసుకున్న తర్వాతే ఎయిర్‌పోర్టులోకి, అనంతరం విమానంలోకి అనుమతిస్తారు. విమానాశ్రాయాల రక్షణ, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం త్వరలోనే ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ యాక్సిస్ విధానాన్ని అమలు చేయనున్నారు. మొదట దేశీయంగా ఈ విధానాన్ని అమలు చేసి ఆ తర్వాత అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు కూడా దీనిని వర్తింపజేయనున్నట్టు తెలుస్తోంది. సో.. ఇక నుంచి ఫ్లైటెక్కేముందు వీసా, పాస్‌పోర్టుతో పాటు ఆధార్‌కార్డును కూడా తీసుకెళ్లాల్సిందేనన్నమాట!