: పవన్ కల్యాణ్ తో ఇంత వరకూ రాజకీయాల గురించి మాట్లాడలేదు: గద్దర్


జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో ఇంతవరకూ రాజకీయాల గురించి తానేమి మాట్లాడలేదని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్ తో కలిసి ముందుకు వెళతారా? అని ఒక న్యూస్ ఛానెల్ లో అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం చెప్పారు. ‘2019లో నేను ఎన్నికల్లో పోటీ చేస్తానా? లేదా? అనేది వేరే విషయం. ఉన్నపళంగా పార్టీ పెట్టడం కన్నా, భావ సారూప్యత ఉన్నవాళ్లందరినీ ఏకం చేస్తా... ’ అంటూ గద్దర్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News