: అమెరికాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బ్యాగ్ ను కొట్టేసిన దుండగులు!


ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు చేదు అనుభవం ఎదురైంది. హూస్టన్ లో ‘ఎస్పీబీ 50’ టూర్ లో ఉండగా ఆయన బ్యాగ్ చోరీకి గురైనట్టు బాలసుబ్రహ్మణ్యం తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. తన బ్యాగ్ లో పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులు, కొంత నగదు సహా పాటల స్క్రిప్టులూ ఉన్నాయన్నారు. హూస్టన్ లోని భారత రాయబార కార్యాలయం అధికారుల సాయంతో డూప్లికేట్ పాస్ పోర్టును పొందానని, తనకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.

అయితే, తన బ్యాగ్ చోరీకి గురైందనే సమాచారం తెలుసుకున్న తన అభిమానులు చాలా మంది ఆందోళన చెందుతున్నారని, తనకేమీ ఇబ్బంది లేదని, బాగానే ఉన్నానని అన్నారు. ‘యువర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈజ్ సేఫ్ అండ్ హీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్.. గాడ్ బ్లెస్ యూ ఆల్’ అని ఎస్పీబీ తన పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, సియాటిల్, లాస్ ఏంజిల్స్, అట్లాంటాలో బాలు ప్రస్తుతం పర్యటిస్తున్నారు.
<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FSPB%2Fvideos%2F1376145355776634%2F&show_text=0&width=560" width="560" height="315" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>

  • Loading...

More Telugu News