: నేనే కనుక ముఖ్యమంత్రి అయితే వారితో రాజీనామా చేయిస్తా!: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు


పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై ప్రధాని మోదీకి తమ పార్టీ మహిళా నేత పురందేశ్వరి లేఖ రాయడం ఆమె వ్యక్తిగతమని బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పురందేశ్వరి రాసిన లేఖ ఆమె వ్యక్తిగతం. అది పార్టీ నిర్ణయం కాదు. ఈ విషయంలో వ్యక్తిగతంగా నేనూ ఏకీభవిస్తా. పార్టీ ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులు కేటాయించడం సరైంది కాదు, సంప్రదాయానికి విరుద్ధం. ఆ నలుగురు మంత్రులు రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే వారి గౌరవం పెరుగుతుంది. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. నేనే కనుక ముఖ్యమంత్రిని అయితే, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, మళ్లీ పోటీ చేయిస్తా. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఒక పార్టీ తరపున గెలిచి.. ఇంకో పార్టీలోకి వెళ్లిపోవడంలో అర్థం లేదు.. ఎమ్మెల్యేలు అలా చేయకూడదు.. మంచి పద్ధతి కాదు’ అన్నారు.

  • Loading...

More Telugu News