: ఆర్కే నగర్ ఉప ఎన్నిక తరువాత అన్నాడీఎంకే రెండు వర్గాలు కలిసిపోతాయి: పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు
ఆర్కే నగర్ ఉపఎన్నిక తరువాత అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు ఒక్కటైపోతాయని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే (పురుచ్చి తలైవి అమ్మ) పార్టీ నేత ఒ.పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం తాత్కాలికమేనని ఆయన చెప్పారు. త్వరలో పార్టీలోని రెండు వర్గాలు ఒక్కటవుతాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం శశికళ వర్గంలో ఉన్న 122 మంది ఎమ్మెల్యేలు ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత తమ మనస్సాక్షికి అనుగుణంగా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. బీజేపీతో పొత్తుపెట్టుకునే ఆలోచన తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇసుక మాఫియా లీడర్ శేఖర్ రెడ్డితో తనకు సంబంధాలు ఉన్నాయంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.