: న్యూయార్క్ లో ప్రమాదం... తెలుగు యువకుడి మృతి


న్యూయార్క్ నగరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వరంగల్ జిల్లాకు చెందిన చింతకింది జీవన్ (30) ఎంబీఏ విద్యను అభ్యసించి, ఐదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి, ఓ ప్రైవేటు సంస్థలో మానవ వనరుల విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం జరిగిన ఓ ప్రమాదంలో అతను మరణించినట్టు, హైదరాబాద్ లో ఉన్న ఆయన సోదరి రేణుకకు సమాచారం అందింది. ప్రస్తుతం టెక్సాస్ లోని ఓ ఆసుపత్రిలో జీవన్ మృతదేహం ఉండగా, బంధువుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కొండా సురేఖ స్పందించారు. జీవన్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News