: ఎంతో మంది సీనియర్లకే రాలేదు... నేనెంత?: టీడీపీ ఎమ్మెల్యే అనిత


మంత్రి పదవులను ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, ఎమ్మెల్యేగా కేవలం రెండున్నరేళ్ల అనుభవం ఉన్న తాను మంత్రి పదవి రాలేదన్న నిరాశలో ఏమీ లేనని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. జన్మభూమి కమిటీల ప్రతినిధులతో, టీడీపీ నాయకులతో సమావేశమైన ఆమె, తనకన్నా ఎంతో మంది సీనియర్లు దశాబ్దాల నుంచి పని చేస్తున్నారని, వారితో పోలిస్తే తానెంతని చెప్పారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు, ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటారని, ఆయన ఆశీస్సులు తనకుంటే చాలని చెప్పారు. వచ్చే రెండేళ్లలో పార్టీ కోసం పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో తనకు 3 వేల ఓట్ల కన్నా తక్కువ మెజారిటీయే వచ్చిందని, ఈ సారి 20 వేల ఓట్ల మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News