: అక్కడ ఇటుకలు తయారు చేయక్కర్లేదు...తవ్వుకుంటే చాలు!
సాధారణంగా ఏదైనా భవన నిర్మాణానికి ఇటుకలు కీలకమైనవి. ఇటుకలు తయారు చేయాలంటే బంక మట్టిని సేకరించాలి. దానిని బాగా కలియబెట్టి, ముద్దగా చేసి, మౌల్డ్ తో పోత పోసి, ఆ తరువాత బట్టీ పేర్చి, దానిని కాల్చాలి. సరైన మోతాదులో కాలిన తరువాతే ఇటుకగా మారుతుంది. ఇలా చేసేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. అయితే ఆఫ్రికాలోని కిబేరా అనే ప్రాంతం వారికి ఇటుకలు కావాలంటే ఇంత కష్టాన్ని భరించాల్సిన పని లేదు.
అక్కడికి దగ్గర్లో ఉన్న ఎర్రమట్టి కొండల్లోకి వెళ్తే... నచ్చిన సైజులో ఇటుకలు తవ్వితీసుకోవచ్చు. ఇటుకలు తవ్వితీసుకోవడమేంటన్న అనుమానం వచ్చిందా? అవును, నిజమే... ఇక్కడున్న భారీ ఎర్రమట్టి కొండలు ఒక పద్దతి ప్రకారం తయారయ్యాయి. అది కూడా ఇటుకలు తయారు చేసి, పేర్చినట్టు రూపొందాయి. అంతే కాకుండా, కాల్చిన మట్టిలా బలంగా కూడా వుంటాయి. దీంతో కిబేరా వాసులు తమకు కావాల్సిన పరిమాణంలో ఇటుకల్ని తవ్వుకుని తీసుకుంటున్నారు. వీటిని స్థానిక పట్టణాల్లో అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.