: జమ్ముకశ్మీర్ క్రికెటర్ల బరితెగింపు...దేశవ్యాప్తంగా ఆగ్రహం!


జమ్మూకశ్మీర్‌ లోని ఓ స్థానిక క్రికెట్ క్లబ్ దుస్సాహసానికి దిగింది. ఇంతవరకు ఆందోళనలు, బంద్ లు, రాళ్ల దాడులతో బరితెగించిన కశ్మీర్ లో స్థానిక క్రికెట్ క్లబ్ ఆటగాళ్లు మోదీ జమ్మూకశ్మీర్ వెళ్లిన వేళ... ఏకంగా పాకిస్థాన్ జెర్సీలు ధరించి క్రికెట్ ఆడారు. ఈ ఘటన వివరాలు గురించి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్దిసేపటికే తీవ్ర విమర్శల దుమారం రేగింది. ఈనెల 2న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించి చెనాని-నస్రి సొరంగ మార్గాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో గాందెర్బల్‌ జిల్లాలోని వయిల్ గ్రౌండ్స్‌ లో క్రికెట్ ఆడిన స్థానిక జట్టు కేవలం పాకిస్థాన్ జెర్సీలు ధరించడంతో సరిపెట్టకుండా... మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏకంగా పాకిస్థాన్ జాతీయగీతాన్ని ఆలపించింది.

కశ్మీర్ జట్టు ధరించిన పాక్ గ్రీన్ జెర్సీలపై బాబా దార్య ఉద్ దిన్ పేరు ఉంది. ప్రముఖ సూఫీ సాధువు అయిన బాబా దార్య ఉద్ దిన్ దర్గా గాందెర్బల్‌ లోనే ఉండడం విశేషం. కాగా, కశ్మీర్ జట్టుతో తలపడిన జట్టు వైట్ జెర్సీలు ధరించడం విశేషం. అన్నింటికంటే దారుణం ఏంటంటే, ఆ గ్రౌండ్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ జాతీయగీతం పాడుతున్నామంటూ లౌడ్ స్పీకర్ లో అనౌన్స్ చేయడం విశేషం. 'తమ జట్టు భిన్నంగా కనిపించేందుకు, కశ్మీర్ సమస్యను మేము ఎప్పటికీ మరిచిపోమని సహచర కశ్మీరీలకు చాటిచెప్పేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నామని' ఆ జట్టులోని ఒక ఆటగాడు తమ చర్యను సమర్ధించుకున్నాడు. 

  • Loading...

More Telugu News