: నా పొగరు వారి దగ్గరే చూపిస్తా: నటి నయనతార
తనకు పొగరు ఎక్కువేనని, అయితే, తన పొగరును చూపించే వాళ్ల దగ్గరే చూపిస్తానని దక్షిణాది అందాల నటి నయనతార చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తనను తక్కువగా చూసే వారి దగ్గర మాత్రమే అలా ఉంటానని తెలిపింది. తన కెరీర్ ప్రారంభంలో ఎలా అయితే ఉన్నానో, అదే విధంగా ఇప్పుడూ ఉన్నానని చెప్పింది. కెరీర్ ప్రారంభంలో కథల ఎంపిక విషయంలో, ఎక్స్ పోజింగ్ విషయంలో కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు కానీ, ఆ తర్వాత జాగ్రత్త పడ్డానని, దానిని చూసి అందరూ తనకు పొగరు అనుకుంటూ ఉంటారని చెప్పుకొచ్చింది. ‘నా పొగరుకు అర్థం ఏంటనేది నాకు మాత్రమే తెలుసు’ అని నయనతార పేర్కొంది.