: తాత కాబోతున్న మమ్ముట్టి, తండ్రి కాబోతున్న సల్మాన్ దుల్కర్!


ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి తాత కాబోతున్నాడు. ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ తండ్రి కాబోతున్నాడు. 2011లో అమల్ సుఫియాతో దుల్కర్ సల్మాన్ వివాహాన్ని మమ్ముట్టి ఘనంగా జరిపించిన సంగతి తెలిసిందే. అనంతరం మలయాళ చిత్రపరిశ్రమలో దుల్కర్ సల్మాన్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. వరుస హిట్లతో స్టార్ గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో నిత్యామీనన్ తో ప్రేమలో ఉన్నాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇన్నాళ్లు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించిన దుల్కర్ సల్మాన్ త్వరలో తండ్రి కాబోతున్నాడంటూ మలయాళ మీడియా చెబుతోంది. దీంతో మమ్ముట్టికి తాతగా, దుల్కర్ సల్మాన్ కు తండ్రిగా ప్రమోషన్ లభిస్తుంది. 

  • Loading...

More Telugu News