: పోస్టు కార్డుపై 'ట్రిపుల్ తలాక్' అంటూ రాసి పంపిన భర్త.. భార్య ఫిర్యాదుతో అరెస్టు
హైదరాబాదులో ట్రిపుల్ తలాక్ కేసులు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ముస్లిం మత పెద్దలు ట్రిపుల్ తలాక్ చెప్పడంలో సహేతుకమైన విధానాలు అవలంబించాలని చెబుతున్నప్పటికీ, పలువురు తమకు నచ్చిన పద్ధతుల్లో తలాక్ చెబుతూ భార్యలను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ముస్లిం మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి తన భార్యను వదిలించుకునేందుకు పోస్టు కార్డుపై మూడు సార్లు తలాక్ అంటూ రాసి పోస్టు చేసి పంపాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని, రిమాండ్ కు పంపారు.