: కోర్టు ఆదేశాలపై నటి రాఖీ సావంత్ ను అరెస్టు చేసిన పోలీసులు


వాల్మీకి మహర్షిని అగౌర‌వ‌ప‌ర్చిన కేసులో బాలీవుడ్ న‌టి రాఖీ సావంత్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాఖీ సావంత్.. రామాయణాన్ని రాసిన వాల్మీకి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. వాల్మీకి గురించి ఆమె చేసిన వ్యాఖ్యల‌పై  పలు హిందూ సంస్థలు ఆమెపై దావా వేయ‌డంతో పలు సార్లు కోర్టు ఆమెకు సమన్లు కూడా జారీ చేసింది. అయితే, వాటిపై ఆమె స్పందించ‌లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లూధియానా కోర్టు ఆమెపై అరెస్టు వారెంటు జారీ చేయ‌డంతో ఈ రోజు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News