: రండి, నిరూపించండి.. ఓపెన్ ఛాలెంజ్ కు సిద్ధమవుతున్న ఎన్నికల సంఘం


ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ పలువురు రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో, ఓపెన్ ఛాలెంజ్ విసిరేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ట్యాంపరింగ్ ఆరోపణలను నిరూపించాలంటూ రాజకీయ పార్టీలు, టెక్నోక్రాట్స్ ను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్న ఎవరైనా సరే తమ సవాల్ ను స్వీకరించవచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి.

ఓపెన్ ఛాలెంజ్ కు సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని... 2009లో కూడా ఇదే విధంగా సవాల్ విసిరామని... కానీ, ట్యాంపరింగ్ ఆరోపణలను ఎవరూ నిరూపించలేకపోయారని ఈ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులు ఈ మధ్య జరిగిన ఎన్నికల అనంతరం కూడా ఈవీఎంల పని తీరుపై ఆరోపణలు చేశారు. 72 గంటల సమయం ఇస్తే... ఈవీఎంల సాఫ్ట్ వేర్ ఏమిటి? వాటిని ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చు? అనే విషయాలను వెల్లడిస్తానని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.  

  • Loading...

More Telugu News