: హీరోగా ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ కుమారుడు
తన తొలి సినిమా 'మైనే ప్యార్ కియా'లో సల్మాన్ ఖాన్ సరసన నటించి, అంతులేని క్రేజ్ ను సంపాదించుకుంది భాగ్యశ్రీ. ప్రస్తుతం ఆమె కుమారుడు అభిమన్యు తెరంగేట్రం చేస్తున్నాడు. 'మర్ద్ కో దర్ద్ నహీ హోతా' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త నటి రాధికా మదన్ నటించనుంది. అంతే కాదు, తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడు. వాసన్ బాల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా యాక్షన్ కామెడీగా రూపొందబోతోంది. అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఈ సందర్భంగా భాగ్యశ్రీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. "కొత్త ప్రారంభం. అభిమన్యుకు మీ ఆదరాభిమానాలు కావాలి. నా కుమారుడిని దీవించండి. మీ మనసులను గెలుచుకోవడానికి ఇదొక ప్రారంభం. మీ మనసులో నా కుమారుడికి కొంచెం స్థానం కల్పించండి" అంటూ ట్వీట్ చేసింది.
New beginnings, please shower your blessings on @abhimanyud
— bhagyashree (@bhagyashree123) April 4, 2017
It's a start to win your hearts, make a little place n be there to stay forever pic.twitter.com/3wJnOZEw9W