: హాయ్ లాండ్ విలువ రూ. 600 కోట్లు... హైకోర్టుకు చేరిన వివరాలు
అగ్రీగోల్డ్ ఆస్తులకు సంబంధించిన వివరాలను సీఐడీ బృందం ఈ ఉదయం హైకోర్టుకు అందించింది. మొత్తం 229 ఆస్తుల వివరాలను ప్రకటిస్తూ, వీటిల్లో 9 ఆస్తులు అత్యంత విలువైనవని తెలిపింది. మొత్తం ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లని తెలిపింది. గుంటూరు, విజయవాడ మధ్య 90 ఎకరాల్లో ఉన్న వాటర్ థీమ్ పార్క్ హాయ్ లాండ్ విలువను రూ. 600 కోట్లుగా లెక్కగట్టింది. అగ్రీగోల్డ్ ఆస్తుల వివరాలను అందుకున్న హైకోర్టు, వీటన్నింటినీ ఆన్ లైన్లో అందరికీ అందుబాటులో ఉంచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. వీటి వేలం ప్రక్రియను త్వరగా చేపట్టాలని సూచించింది. కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.