: ట్విట్టర్ లో సాయమడిగిన యువకుడు... స్పందించిన ఎంపీ కవిత


తనకు సాయం చేయాలని ట్విట్ట‌ర్‌లో ఓ యువ‌కుడు చేసిన ట్వీట్‌కు నిజామాబాద్ ఎంపీ క‌విత స్పందించారు. 2014 జనవరి 10వ తేదీన బతుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా తాను పూలు కోసి తెచ్చేందుకు వెళ్లాన‌ని, అయితే ఆ ప్రయత్నంలో తనకు కరెంట్ షాక్ తగలడంతో రెండు కాళ్లు కోల్పోయాన‌ని మంచిర్యాల, నస్పూర్ కు చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎస్ శేఖర్ ట్విట్టర్‌లో క‌వితకు తెలిపాడు. త‌న‌కు సాయం చేయాల్సిందిగా కోరాడు. తాను అప్ప‌ట్లో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న‌ప్ప‌టికీ సాయం అందలేదని చెప్పాడు.

ఆ ట్వీట్‌పై స్పందించిన క‌విత త‌ప్ప‌కుండా సాయం చేస్తాన‌ని, ఆ బాధితుడి పూర్తి వివరాలను సంతోష్.జాగృతి@జీమెయిల్.కామ్ కు పంపించాలని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనకు సాయం చేయాలని శేఖర్ ట్విట్ట‌ర్‌లో వేడుకుంటున్నాడు. క‌రెంట్ షాక్‌తో త‌న‌ రెండు కాళ్లు కోల్పోయినప్పుడు వైద్యం కోసం సుమారు రూ.18 లక్షలు ఖర్చు అయింద‌ని ఆయ‌న కొన్ని రోజుల నుంచి ట్వీట్ చేస్తున్నాడు. తనకు వికలాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పించాలని పేర్కొన్నాడు.






  • Loading...

More Telugu News