: ట్విట్టర్ క్వీన్ సానియా
రాకెట్ క్వీన్ సానియా మీర్జా టెన్నిస్ కోర్టులోనే కాదు, ట్విట్టర్లోనూ హల్ చల్ చేస్తోంది. ఇప్పుడామె ట్విట్టర్ మిలియనీర్. ఎలాగంటే, సానియాను ట్విట్టర్లో పది లక్షల మందికి పైగా అనుసరిస్తున్నారట.ఇదో రికార్డు కూడా. ఇంత భారీ సంఖ్యలో ట్విట్టర్లో అభిమానులను సొంతం చేసుకున్న భారత క్రీడాకారిణి సానియానే కావడం విశేషం. ఈ విషయమై సానియా ఏమంటుందో వినండి. ఫ్యాన్స్ తో నిరంతరం టచ్ లో ఉండేందుకు ట్విట్టర్ ఓ అద్భుత సాధనమని కితాబిచ్చారు.