: యోగి ఎఫెక్ట్... ఉన్నతాధికారుల పొట్టలు కరిగిపోతున్నాయ్!


యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి అక్కడ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గతంలో సాయంత్రం ఆరు దాటితే చాలు... సచివాలయం మొత్తం బోసిపోయినట్టు అయిపోయేది. మంత్రులు, ఉన్నతాధికారులు మొత్తం వెళ్లిపోయేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాత్రి 11 గంటల వరకు యోగి సచివాలయంలోనే ఉంటున్నారు. వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో, మంత్రులు, అధికారులంతా సచివాలయంలోనే ఉండాల్సి వస్తోంది.

యోగి ఎప్పుడు ఏ ఫైల్ అడుగుతారో అనే భయంతో సిబ్బంది మొత్తం అలర్ట్ గా ఉంటోంది. ఫైళ్లను పట్టుకుని అటూ ఇటూ పరుగెడుతున్న అధికారులతో సచివాలయం చాలా బిజీగా మారిపోయింది. మంత్రులు కూడా నిత్యం తమ తమ శాఖల కార్యదర్శులతో చర్చల్లో మునిగిపోతున్నారు. ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి సరదాగా మాట్లాడుతూ, ఇంతకు ముందు సాయంత్రం అయితే చాలు... ఇళ్లకు వెళ్లి, జంక్ ఫుడ్ తింటూ, టీవీలు చూస్తూ అధికారులంతా పొట్టలు పెంచేశారని... ఇప్పుడు వారి పొట్టలన్నీ కరిగిపోతున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News