: త్వరలో రూ.200 నోటు.. రిజర్వు బ్యాంకు తాజా నిర్ణయం!
భారతీయ రిజర్వు బ్యాంకు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రూ.200 నోటును విడుదల చేయాలని నిర్ణయించింది. గత నెలలో జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోట్ల ముద్రణ ప్రారంభం కానుంది. జూన్ తర్వాత నుంచి రూ.200 నోట్ల ముద్రణ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్లో చిన్ననోట్ల కొరత, డిజిటల్ లావాదేవీలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు రిజర్వు బ్యాంకు అధికారులు నిరాకరించారు.