: క్షేత్రస్థాయి పర్యటనకు చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 100 రోజులు


ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరవు పరిస్థితులు, నీటి ఎద్దడి ప్రభావం, నివారణ చర్యల అధ్యయనం కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని నిర్ణయించారు. వారానికి రెండు రోజుల చొప్పున జిల్లాల్లో వంద రోజులపాటు పర్యటించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. సోమవారం ఆయన వెలగపూడి సచివాలయం నుంచి పోలవరం పనుల  పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయాలని, ప్రజల భాగస్వామ్యంతో ‘నీరు-ప్రగతి’, ‘నీరు-చెట్టు’, పంటకుంటల తవ్వకం వంటి కార్యక్రమాలను చేపట్టాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజల వద్దకు వెళ్తే వారి సమస్యలు తెలుస్తాయని, తన పర్యటనకు సంబంధించిన ప్రణాళిక రూపొందించాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు.

  • Loading...

More Telugu News