: ఈ నెల 6న ఏపీ మంత్రి వర్గ సమావేశం


కేబినెట్ విస్తరణ అనంతరం తొలి కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. పాత, కొత్త కలయికతో కూడిన మంత్రి వర్గం ఈనెల 6న ఏపీ రాజధానిలో సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు నిర్ణయాలను తీసుకోనున్నారు. కొత్త మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరుకానుండడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాన్ని మంగళవారం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ బుధవారం శ్రీరామనవమి కావడంతో మంత్రి వర్గ సమావేశాన్ని 6వ తేదీకి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News