: బుచ్చయ్య చౌదరిని కలిసిన చిన రాజప్ప!


మంత్రి పదవి దక్కలేదనే నిరాశలో ఉన్న టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని  ఏపీ మంత్రి  చిన రాజప్ప ఈ రోజు కలిశారు. బుచ్చయ్య చౌదరికి నచ్చజెప్పారు. ఈ సందర్భంగా చిన రాజప్ప మీడియాతో మాట్లాడుతూ, బుచ్చయ్య చౌదరి వద్దకు తనను ఎవరూ పంపలేదని, జిల్లా మంత్రిగా తానే మాట్లాడానని అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని, బుచ్చయ్య చౌదరి చెప్పిన అంశాలను సీఎం చంద్రబాబు దృష్టిికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై చిన రాజప్ప మండిపడ్డారు. నీతులు మాట్లాడే నైతికహక్కు జగన్ కు లేదని అన్నారు.

  • Loading...

More Telugu News