: రష్యాలో మెట్రో ట్రైన్ లో బాంబు పేలుడు!
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ రైల్వే స్టేషన్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. మెట్రో ట్రైన్ లో ఈ పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. చాలా మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఎనిమిది అంబులెన్సులలో తరలించారు. పలువురికి అక్కడే వైద్యసేవలందిస్తూ ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీంతో సెయింట్ పీటర్స్ బర్గ్ రైల్వే స్టేషన్ సమీపంలోని మరో మూడు రైల్వే స్టేషన్లను మూసివేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.