: కపిల్ శర్మకు ఊరటనిచ్చిన సోనీ చానెల్
ప్రముఖ హిందీ బుల్లి తెర కమేడియన్ కపిల్ శర్మకు సోనీ టెలివిజన్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. కపిల్ శర్మ సోనీలో నిర్వహిస్తున్న 'ద కపిల్ శర్మ షో' నుంచి సునీల్ గ్రోవర్ తో పాటు ఇతర నటులు కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ షో రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఇలాంటి దశలో కపిల్ శర్మకు సోనీ టీవీ అండగా నిలిచింది. మరో రెండు వారాల్లో కపిల్ శర్మతో గతంలో చేసుకున్న ఒప్పందం గడువు ముగుస్తోంది. ఈ దశలో మరో నెల రోజుల పాటు ఒప్పందాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో మరో ఆరు వారాల పాటు 'ద కపిల్ శర్మ' షో సోనీ టీవీలో ప్రసారం కానుంది. తరువాత ఈ షో భవితవ్యం తేలనుంది. ఇంకో వైపు సునీల్ గ్రోవర్ ను కపిల్ మరోసారి ఆలోచించాలని కోరగా, అవమానాల పాలవుతూ షోలో కొనసాగడం కుదరదని తేల్చిచెప్పాడు.