: రావెలకు తిరిగి మంత్రి పదవి ఇవ్వాలంటూ సెల్ టవర్ ఎక్కిన ఆటో డ్రైవర్!
రావెల కిషోర్ బాబును మంత్రి పదవి నుంచి తొలగించడంపై ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఈ రోజు మధ్యాహ్నం సెల్ టవర్ పైకి ఎక్కి హంగామా సృష్టించాడు. స్థానిక అరండల్ పేట 16వ లైనులో ఉన్న సెల్ టవర్ పైకి ఆ ఆటో డ్రైవర్ ఎక్కాడు. రావెలకు తిరిగి మంత్రి పదవి ఇవ్వాలని, లేకుంటే, టవర్ పై నుంచి దూకుతానంటూ బెదిరించాడు. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ సరిత అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తామని, కిందకు దిగాలని చెప్పారు. కొంచెం సేపటికి శాంతించిన ఆటో డ్రైవర్, ఆ సెల్ టవర్ పై నుంచి కిందకు దిగాడు.