: డొనాల్డ్ ట్రంప్ క్రేజ్.. వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన ట్రంప్ కారు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు వాడిన ఫెరారీ ఎఫ్430 కారును తాజాగా వేలం వేయగా అది రికార్డు ధర పలికింది. సాధారణంగా ఈ మోడల్ కారు 125000 నుంచి 175000 డాలర్లు పలుకుతుంది. అయితే, ట్రంప్ సుమారు నాలుగేళ్లు వాడిన కారు కావడంతో ఇది ఇప్పుడు వేలంలో 270000 డాలర్లు (సుమారు రూ. కోటి 75 లక్షలు) పలికింది. ఈ కారును ఎవరు సొంతం చేసుకున్నారన్న విషయాన్ని నిర్వాహకులు వెల్లడించలేదు. 2007 ఏడాదికి చెందిన ఈ ఎఫ్430 కారును సొంతం చేసుకోవడం కోసం ట్రంప్ అభిమానులు భారీగా వచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఈ మోడల్ ఫెరారీ కారును తయారు చేయడం లేదని చెప్పారు.