: రెజ్లింగ్ రింగ్ లో డైమండ్ రింగ్ తో ప్రపోజల్... విజయంతో ప్రియురాలికి ప్రేమను వ్యక్తీకరించిన జాన్ సెనా!


ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ ఆటగాడు, హాలీవుడ్ నటుడు జాన్ సెనా తన ప్రియురాలికి చేసిన ప్రపోజల్ అభిమానులను అలరిస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో రెజ్లింగ్ మేనియాను నిర్వహించారు. ఇందులో  మిజ్‌ (అమెరికా)- మార్సి (కెనడా) జంటను భారీ కాయుడైన జాన్ సెనా-నిక్కీ బెల్లా మట్టికరిపించారు. అనంతరం విజయోత్సవాల స్థానంలో జాన్  సెనా మోకాళ్లపై కూర్చుని నిక్కీ బెల్లాకు డైమండ్ రింగ్ ను చూపించి పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్రపోజ్ చేశాడు. దీంతో తొలుత ఆశ్చర్యపోయిన నిక్కీ వెంటనే అంగీకరించింది. డబ్ల్యూడబ్ల్యూఈలో క్రేజ్ ఉన్న జాన్ సెనా రింగ్ లో ప్రపోజ్ చేయడం, దానిని ఆమె అంగీకరించడం అభిమానులను అలరించింది. ఈ వీడియో మీరు కూడా చూడండి.



  • Loading...

More Telugu News