: టీడీపీలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నా.. ప్రమోషన్ లేని కార్మికుడిని నేను: ఎమ్మెల్యే బీకే పార్థసారథి
ఏపీ మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కకపోవడంపై నిరాశతో ఉన్న అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అనే పరిశ్రమలో తాను ముప్ఫై ఆరు సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పని చేస్తున్నా ప్రమోషన్ లేని కార్మికుడినని అన్నారు. ‘నాలా ప్రమోషన్ లేని సీనియర్ కార్మికులు ఎందరో జిల్లాలో ఉన్నారు. నాకే పదవి రాకపోతే, ఇక, వారికేమి దక్కుతుంది?’ అని పార్థసారథి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో మండల స్థాయి అధ్యక్షుడి నుంచి జెడ్పీ చైర్ పర్సన్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎదిగానని, ప్రస్తుతం ఏడేళ్ల నుంచి అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నానని చెప్పారు. ఒక పార్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఇంతకన్నా ఇంకేం అర్హతలు కావాలని ఆయన ప్రశ్నించారు.