: తల్లికావాలని ఏడుస్తున్న చిన్నారిని బుజ్జగించలేక తండ్రి ఆత్మహత్య
గత నెల 22న భర్తతో గొడవ కారణంగా ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో అప్పటి నుంచి ఆమె రెండేళ్ల చిన్నారి విజయ్ ఆలనాపాలనను తండ్రే చూసుకుంటున్నాడు. అయితే, ఇప్పుడు ఆ పిల్లాడికి తండ్రి కూడా దూరమయ్యాడు. తన భార్య లేకుండా తాను బతకలేనని, తమ పిల్లాడు అమ్మ కావాలని ఏడ్చిన సమయంలో బాధను తట్టుకోలేకపోతున్నానని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు. ఢిల్లీలో నివసించే విజయ్ ద్వివేది, ప్రియ దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడని, వారిరువురూ రెండు వారాల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. తన భార్య ఉరివేసుకున్న ఫ్యాన్‌కే తాను కూడా ఉరివేసుకొని విజయ్ ద్వివేది ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు.