: చెన్నైకి చెలగాటం.. పంజాబ్ కు ఓటమి సంకటం


వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం అలంకరించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో తలపడనుంది. పంజాబ్ జట్టు ఇప్పటివరకు 9 మ్యాచ్ లాడి 4 విజయాలు ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే నాకౌట్ దశకు దాదాపు అర్హత సాధించిన చెన్నై మరో విజయం కోసం ఉరకలేస్తుండగా.. ఈ మ్యాచ్ లో జయభేరి మోగించి, తదుపరి రౌండ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని పంజాబ్ కింగ్స్ భావిస్తున్నారు.

అయితే, అమేయ ఫామ్ తో దూసుకెళుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ను నిలువరించడం పంజాబ్ శక్తికి మించిన పనే. ధోనీ, రైనా, హస్సీ వంటి డైనమిక్ బ్యాట్స్ మెన్ కు తోడు.. అల్బీ మోర్కెల్, డ్వేన్ బ్రావో వంటి బౌలింగ్ ఆల్ రౌండర్లతో చెన్నై ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు చెన్నైలో జరిగే మ్యాచ్ పంజాబ్ కు పీడకలగా పరిణమించడం ఖాయమని క్రికెట్ పండితులంటున్నారు. మరికాసేపట్లో పోరు ఆరంభం కానుంది. టాస్ గెలిచిన ధోనీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక.

  • Loading...

More Telugu News