: ప్రధాని పర్యటనలో ఉండగానే శ్రీనగర్‌లో పేలిన గ్రనేడ్... పోలీసు మృతి


ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం జమ్ములో ఉండగానే ఉగ్రవాదులు ఓ పోలీసు వాహనంపై దాడిచేశారు. ఈ ఘటనలో ఓ  పోలీసు మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్ జాతీయ రహదారిపై చెనని-నష్రీ టన్నెల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది సేపటికే నౌహట్టా ప్రాంతంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. గాయపడిన పోలీసులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసు పార్టీ రోజువారీ బాధ్యతలను పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News