: పోటీ చేస్తే ఏపీలోనూ టీఆర్ఎస్ గెలుస్తుంది: తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి
టీఆర్ఎస్ పోటీ చేస్తే ఆంధ్ర్రప్రదేశ్‌లోనూ గెలుస్తుందని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో జగ్గయ్యపేట, నందిగామల నుంచి టీఆర్ఎస్ పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని మంత్రి జోస్యం చెప్పారు.